బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:12 IST)

పాల వ్యాపారం కోసం ఏకంగా హెలికాప్టర్‌నే కొనేశాడు..

మహారాష్ట్రలోని భివాండికి చెందిన రైతు పాల వ్యాపారం కోసం ఏకంగా హెలికాప్టర్‌నే కొనేశాడు. రైతు రూ.30 కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్‌ కొనడంతో ఈ విషయం తెలిసిన వారందరూ అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే.. జనార్ధన్‌ భోయిర్‌ అనే రైతు ఈ మధ్యే పాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు తరచూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆయన వెళ్లే ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్‌ సదుపాయం లేకపోవడంతో రైళ్లు, బస్సుల్లో వెళ్తుండేవాడు.

దీంతో సమయం ఎక్కువగా వధా అవుతుండటంతో స్నేహితుడి సలహా మేరకు ఓ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశాడు. ఇప్పటికే హెలికాప్టర్‌ను తన గ్రామానికి తీసుకొచ్చి ట్రయల్స్‌ కూడా వేశారట. 2.5 ఎకరాల స్థలంలో హెలికాఫ్టర్‌ కోసం ప్రొటెక్టివ్‌ వాల్‌ను నిర్మించాడు.

మార్చి 15న హెలికాప్టర్‌ను జనార్ధన్‌ ఇంటికి డెలీవరీ చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయం, డైరీ బిజినెస్‌లతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేసే జనార్ధన్‌కు దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు సమాచారం.