గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (07:37 IST)

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిపై బాంబు దాడి.. పరిస్థితి విషమం

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మంత్రిపై బాంబుదాడి జరిగింది. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆ మంత్రి పేరు జాకీర్ హుస్సేన్. ఈ బాంబు దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కోల్‌కతా వెళ్లేందుకు ముర్షిదాబాద్ జిల్లాలోని నిమ్తితా రైల్వే స్టేషన్‌లో మంత్రి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయనపై బాంబులు విసిరారు. బాంబు పేలుళ్లతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మంత్రిని జంగీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మంత్రితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. మంత్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.