మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (13:58 IST)

రైతుల చనిపోతే ఇంత హేళనగా మాట్లాడతారా? తాప్సీ

కేంద్రం తెచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులంతా ఏకమై ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రెండున్నర నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో ఆందోళన చేస్తున్న రైతుల్లో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
ఈ అంశంపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. "ఎక్కడ చనిపోతే ఏం? ఇంట్లో ఉంటే మాత్రం చనిపోకుండా ఉంటారా? వాళ్లు ఇష్టపూర్వకంగానే మరణించారు. కొన్ని లక్షల మంది జనాభాలో రెండు వందల మంది చనిపోతే అదేమంత పెద్ద విషయమా?" అంటూ దలాల్ అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో దలాల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.
 
తాజాగా ఈ వ్యాఖ్యలపై సినీ నటి తాప్సీ కాస్తంత ఘాటుగానే స్పందించారు. మన ఆకలి తీర్చే రైతన్నల ప్రాణాలకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు చనిపోతే ఇంత హేళనగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మనిషి జీవితమే చులకనగా మారిపోయింది అని తెలిపారు.