ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (18:58 IST)

ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేట్ చేయడం నాకు ఇష్టం లేదు.. తాప్సీ

దక్షిణాది, ఉత్తరాది సినీ హీరోయిన్‌గా అదరగొడుతున్న ఢిల్లీ భామ తాప్సీ. ప్రస్తుతం రష్మీ రాకెట్ చిత్రంలో నటిస్తోంది తాప్సీ. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. అప్పుడప్పుడు మథియాస్‌తో వెకేషన్లకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది.తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి పబ్లిగ్గా ఎప్పుడూ మాట్లాడరెందుకని తాప్సీని ఓ ఇంటర్వ్యూలో అడిగారు.
 
దీనికి తాప్సీ స్పందిస్తూ.. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేట్ చేయడం నాకిష్టం లేదు. నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు వేర్వేరు. నాకు సంబంధించిన వారి పుట్టిన రోజుల్లో పాల్గొన్నపుడు ఏదో ఒక స్టిల్‌ను పంచుకుంటాను. నా పర్సనల్ లైఫ్‌లో భాగమైన మథియాస్ విషయంలో అదే చేశానని చెప్పుకొచ్చింది.
 
పెండ్లి ప్లాన్ గురించి మాట్లాడుతూ.. నేను ఏదో ఒకసారి ఐదారు సినిమాలు చేయడానికి బదులు రెండుమూడు సినిమాలే చేయడంపై దృష్టిపెడతాను. అప్పుడే నా వ్యక్తిగత జీవితం కోసం సమయాన్ని కేటాయించే అవకాశం దొరుకుతుందని చెప్పుకొచ్చింది.
 
ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, సినిమాలు తగ్గించాలనుకున్న తర్వాత పెండ్లి గురించి ఆలోచిస్తానని చెప్పకనే చెప్పింది తాప్సీ. తాప్సీ దీంతోపాటు తమిళ్‌లో జనగణమన చిత్రంతోపాటు మరో సినిమా కూడా చేస్తోంది. హిందీలో మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టింది.