మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (22:06 IST)

ఆంధ్రప్రదేశ్ సీఎంకు కీలక అవార్డు: అత్యుత్తమ ముఖ్యమంత్రిగా..?

jagan
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కీలక అవార్డ్ దక్కింది. ఇప్పటిదాకా ఏపీలో వివిధ శాఖలు, విభాగాలు అత్యుత్తమ పనితీరును కనపర్చినందుకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ గుర్తింపు పొందారు. బెస్ట్ చీఫ్ మినిస్టర్‌‌గా స్కోచ్ అవార్డును ఆయన అందుకున్నారు. 
 
ఒక ఏడాది పొడవునా ముఖ్యమంత్రి అందజేసిన పరిపాలనను బేస్ చేసుకుని స్కోచ్ గ్రూప్ సంస్థ ఈ అవార్డులను అందజేస్తూ ఉంటుంది. ఆ అవార్డు మంగళవారం జగన్ అందుకున్నారు. స్కోచ్ గ్రూప్ సంస్థల ఛైర్మన్ సమీర్ కొచ్చర్ నేడు వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. 
 
ఈ అవార్డును ఆయనకు అందజేశారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వైఎస్సార్ చేయూత, దిశ చట్టం, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రాతిపదికగా తీసుకుని ఆయనకు ఈ అవార్డును అందజేసినట్లు స్కోచ్ గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదిన్నర కాలంలోనే స్కోచ్ నుంచి అత్యుత్తమ ముఖ్యమంత్రి అవార్డును అందుకోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఇక జగన్ ఈ అవార్డ్ అందుకోవడమతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.