బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (14:37 IST)

ఏపీలో పల్లెపోరు : 17న మూడో దశ పోలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ క్రమంలో బుధవారం మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 
 
మొత్తం 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 579 ఏక గ్రీవాలు కాగా... ఫిబ్రవరి 17న 2640 సర్పంచ్.. 19,607 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 
 
ఇకపోతే, నాలుగో విడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు మంగళవారంతో ముగియనుంది. 3 గంటల తరవాత అభ్యర్థుల తుది జాబితాను ఎస్‌ఈసీ ప్రకటించనుంది. ఫిబ్రవరి 21న పోలింగ్ నిర్వహించున్నారు. 
 
కాగా, ఈ ఎన్నికల కోసం అధికార వైకాపా, టీడీపీలతో పాటు.. జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. తమ మద్దతుతో అభ్యర్థులను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.