శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (11:47 IST)

ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు.. పారదర్శకంగా జరగాలి: ఎస్ఈసీ

రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్‌ చెబుతోందని ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వ్యవస్థ అవసరమన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతిఒక్కరూ మందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. 
 
విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్‌ చెబుతోందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వ్యవస్థ అవసరమని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూడాల్సిన అవసరం ఉందన్న నిమ్మగడ్డ.. స్వీయనియంత్రణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏకగ్రీవాలకు తాము వ్యతిరేకం కాదని... పారదర్శకంగా జరగాలని అభిప్రాయపడ్డారు
 
అలాగే, విశాఖ జిల్లా వ్యాప్తంగా 20,118 పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి డివిజన్‌లో రెండు దశల్లో శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వ్యవస్థ అవసరం. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. 
 
రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూడాలి. మేం స్వీయ నియంత్రణకు కట్టుబడి ఉన్నాం. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు.. అవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి’ అని నిమ్మగడ్డ కోరారు.