స్వామీ తిరుమలేశా, ఏపికి అమరావతి రాజధానిగా వుండేట్లు చేయి: రఘురామక్రిష్ణమ రాజు
రఘురామక్రిష్ణుమ రాజు గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే వైసిపి పార్టీ జెండాతో గెలిచి ఆ పార్టీలో కాకరేపుతున్న వ్యక్తి రఘురామక్రిష్ణుమరాజు. వైసిపి ఎంపిగా కొనసాగుతున్న రఘురామక్రిష్ణమరాజు ఆ పార్టీ నేతలు విమర్సిస్తున్నారు. ఎప్పుడూ ఢిల్లీ వేదికగా ప్రెస్‌మీట్లు పెట్టే రఘురామక్రిష్ణుమరాజు తిరుమలలో ప్రత్యక్షమయ్యారు.
తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున ఆయన దర్సించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయం వెలుపల మీడియాతో రఘురామక్రిష్ణుమరాజు మాట్లాడారు. శ్రీనివాసుడంటే తనకు అమితమైన భక్తి అన్నారు రఘురామక్రిష్ణుమరాజు.
గతంలో మూడు నెలలకు ఒకసారి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్సించుకుంటూ ఉండేవాడినని. అయితే కరోనా కారణంగా తిరుమలకు రాలేకపోయినట్లు చెప్పారు. కానీ స్వామివారిని ఈరోజు తనివితీరా దర్సించుకున్నట్లు చెప్పారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు.
ఎంతోమంది రైతుల త్యాగాలు అమరావతి అని చెప్పిన ఎంపి.. కోర్టులో అమరావతి రైతులకే సానుకూలంగా తీర్పు రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.