సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2016 (13:50 IST)

గర్భ నిరోధక సాధనాలు విఫలమైతే.. అవివాహితులు కూడా గర్భస్రావం చేయించుకోవచ్చా?

గర్భ నిరోధక సాధనాలు విఫలమైతే.. అవివాహితులైనా గర్భస్రావం చేయించుకోవచ్చుననేందుకు సంబంధిత చట్ట సవరణకు కేంద్ర ఆరోగ్యశాఖ సిఫార్సు చేసింది. గర్భ నిరోధక సాధనాలు విఫలమై గర్భం దాల్చితే.. అవివాహిత మహిళలు కూడా చ

గర్భ నిరోధక సాధనాలు విఫలమైతే.. అవివాహితులైనా గర్భస్రావం చేయించుకోవచ్చుననేందుకు సంబంధిత చట్ట సవరణకు కేంద్ర ఆరోగ్యశాఖ సిఫార్సు చేసింది. గర్భ నిరోధక సాధనాలు విఫలమై గర్భం దాల్చితే.. అవివాహిత మహిళలు కూడా చట్టబద్ధంగా గర్భవిచ్ఛిత్తి చేయించుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ భావిస్తోంది.
 
ఈ మేరకు 'వైద్య కారణాలతో గర్భం తొలగింపు(ఎంటీపీ)' చట్టానికి సవరణలు చేయాల్సిందిగా సిఫార్సు చేసింది. గర్భ నిరోధక సాధనాలు విఫలమైతే గర్భస్రావం చేయించుకోవడాన్ని.. వివాహితలకు మాత్రమే చట్టబద్ధమైన కారణంగా ఈ చట్టం గుర్తిస్తోంది. కానీ అయితే వివాహితా? ఒంటరి మహిళా? అనే తేడా లేకుండా గర్భవిచ్ఛిత్తి కోరుకునే అందరికీ ఈ అవకాశం కల్పించాలని ఆరోగ్యశాఖ తాజా సిఫార్సుల్లో పేర్కొంది.
 
అయితే ఈ చట్టసవరణకు వ్యతిరేకత ఉందని.. వివాహితులకు గర్భస్రావానికి అనుమతి ఉన్న నేపథ్యంలో.. అవివాహితులకు కూడా గర్భస్రావం చేయించుకునే చట్టబద్ధత కల్పిస్తే.. భ్రూణ మరణాలు పెచ్చరిల్లిపోతాయని.. అక్రమ సంబంధాలతో సమాజం పెడదారిన పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.