గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జులై 2022 (10:32 IST)

దక్షిణ ఒరిశాపై అల్పపీడనం - కోస్తాకు వర్ష సూచన

దక్షిణ ఒరిస్సాపై తీవ్ర అల్పపీడనం నెలకొంది. ఈ కారణంగా వచ్చే 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ప్రస్తుతం ఈ అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి వుందని, దీనివల్ల ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు వంగి ఉన్నట్టు వివరించింది. ఫలితంగా వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
 
మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఎల్లుండి వరకు మత్స్యుకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. 
 
రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 12వ తేదీ వరకు 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సివుండగా, ఇప్పటివరకు 78.7 శాతం వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.