మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (18:15 IST)

విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తికి రూ.1001 బహుమతి

తమిళనాడు రాష్ట్రంలోని హిందూ మక్కల్ కట్చి సంచలన ప్రకటన చేసింది. ఇటీవల బెంగుళూరు విమానాశ్రయంలో తమిళ హీరో  విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తికి రూ.1001 నగదు బహుమతిని ప్రకటించింది. అలాగే, విజయ్ సేతుపతిని తన్నిని వారికి ఇకపై కూడా ఇదే తరహా నగదు బహుమతి అందజేస్తామని తెలిపింది. 
 
నిజానికి ఈ ఘటనను విజయే సేతుపతి చిన్నదిగా కొట్టిపడేశారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి అలా ప్రవర్తించారని, ఇది పోలీస్ స్టేషనులోనే సమస్య పరిష్కారమైందని వెల్లడించారు. కానీ, హిందూ మక్కల్ కట్చి మాత్రం ఇపుడు ఈ సమస్యను మరింత పెద్దది చేసేలా ఇలా ప్రకటన చేయడం ఇపుడు తమిళనాడు చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా, విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి.. ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస ఆఫర్లతో తెగ బిజీగా మారిపోతున్నారు. తమిళ్‌లో హీరోగా కొనసాగుతూనే.. తాజాగా ‘మాస్టర్'‌ సినిమాలో, అలాగే 'ఉప్పెన' సినిమాల్లో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించాడు.