శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

మరిదితో అక్రమ సంబంధం... పరువు హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. సత్వతి (24) అనే మహిళను కన్నతండ్రి, సొంత సోదరుడే కాటికి పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. సత్వతి (24) అనే మహిళను కన్నతండ్రి, సొంత సోదరుడే కాటికి పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
షమ్లి జిల్లాలోని ముండేట్‌ కాలా గ్రామానికి చెందిన సత్వతి అనే మహిళ సొంత మరిదితో అక్రమ సంబంధం ఉంది. దీంతో ఆ మహిళ తండ్రి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఆమెపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ మైదానంలో పడేశారు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సత్వతి తండ్రి, సోదరుడితోపాటు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. వీరివద్ద విచారణ జరుపగా, హత్య చేసినట్టు అంగీకరించారని.. తమ కుటుంబ పరువును కాపాడేందుకు ఈ చర్యకు దిగినట్లు చెప్పారని వివరించారు.