ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (17:17 IST)

జొమాటో ద్వారా ఆర్డర్ చేసిన న్యూడిల్స్ సూప్‌లో బొద్దింక

Cockroach
Cockroach
ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. సమయాన్ని ఆదా చేయడంలో ఈ యాప్‌లు సాయపడుతున్నప్పటికీ.. అందుకున్న ఆహారం నాణ్యత కొరవడుతుంది. గతంలో రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసిన వంటల్లో పురుగులు ఉన్నాయని ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు, అలాంటి మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది.
 
ఫుడ్ సర్వీస్ పరిశ్రమలో ఆందోళన రేకెత్తించింది. గురుగ్రామ్ ఆధారిత రెస్టారెంట్ నుండి జొమాటో ద్వారా ఆర్డర్ చేసిన ఆహారంల బొద్దింక కనిపించిందని ఒక వినియోగదారు ఫిర్యాదు చేశారు. ఎంఎస్ ఆచార్య న్యూడిల్స్ సూప్‌లో చనిపోయిన బొద్దింక చిత్రాలను కూడా పంచుకున్నారు. 
 
ఇప్పుడే జొమాటో నుండి ఆర్డర్ చేయడం భయంకరమైన అనుభవాన్ని కలిగించిందని చెప్పారు. నాణ్యత నియంత్రణతో నిరాశ తప్పలేదని చెప్పారు. ఈ ఘటనపై జొమాటో స్పందించింది.  దురదృష్టకర సంఘటన గురించి విన్నందుకు చింతిస్తున్నాము. ఈ ఘటనపై త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.