భార్య మందలించిందని భర్త ఆత్మహత్య.. ఎక్కడ?
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కోపాళ్యంలో నివాసముండే క్రిష్ణప్ప(42) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, కొద్దిరోజుల నుంచి అతను పనులకు వెళ్లడంలేదు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఇవాళ పనికి ఎందుకు వెళ్లలేదంటూ ఇటీవల అతడిని భార్య మందలించి బయటకు వెళ్లింది. తీవ్ర మనస్థాపానికి గురైన అతను భార్య తిరిగి వచ్చేసరికి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.