శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 27 నవంబరు 2019 (11:00 IST)

భర్త అక్రమ సంబంధం తెలిసి ఆమెతోనే వివాహం చేసిన భార్య, ఎక్కడ?

తన భర్త వేరే మహిళతో మాట్లాడితేనే ఏ భార్య తట్టుకోలేదు. అలాంటిది ఓ భార్య తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో వివాహం జరిపించింది. ఒడిస్సాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
ఒడిస్సాలోని మల్కన్ గిరి జిల్లాలోని మత్తిలి సమితిలోని కుమార్ పల్లి గ్రామానికి చెందిన రామకావసికి కొన్నేళ్ళ క్రితం గాయత్రి అనే యువతితో పెళ్ళి జరిగింది. పిల్లలు పుట్టడంతో పాటు ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా సాగిపోతోన్న వీరి జీవితంలో ఇటీవల కాలంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడ్డాయి.
 
రామ కావసికి కొద్దిరోజుల క్రితం ఐత మడకామి అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనను పెళ్ళి చేసుకోవాలని లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రామకావసిపై యువతి ఒత్తిడి తీసుకొచ్చింది. తనకు గతంలోనే వివాహం జరిగిందని, ఇప్పట్లో పెళ్ళి చేసుకోలేనని రామకావసి తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
విషయం కాస్త చివరకు రామకావసి భార్యకు తెలిసింది. అయితే గాయత్రి తన భర్తకు ధైర్యం చెప్పింది. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న యువతిని ఇంటికి పిలిచి నా భర్త నిన్ను పెళ్ళి చేసుకుంటాడని చెప్పింది. దీంతో భర్త షాకయ్యాడు. ఆ యువతి కూడా అందుకు ఒప్పుకుని కేసు వెనక్కి తీసుకుంది. దీనితో రెండోపెళ్ళికి సిద్థమయ్యాడు రామకావసి. ఇది కాస్త గ్రామంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.