శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (11:15 IST)

నా కిడ్నీలు విఫలమయ్యాయి... శ్రీ కృష్ణుడే కాపాడాలి: సుష్మా స్వరాజ్ ట్వీట్

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీలు విఫలమయ్యాయి. దీంతో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయివున్నారు. దీనిపై ఆమె ట్వీ

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీలు విఫలమయ్యాయి. దీంతో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయివున్నారు. దీనిపై ఆమె ట్వీట్ చేశారు. 
 
తన అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు ఆందోళన కలిగించేలా తాను మూత్ర పిండాల వ్యాధితో బాధపతుతున్నానని, ప్రస్తుతం తనకు డయాలసిస్ జరుగుతోందని, ఇందుకోసం తాను ఎయిమ్స్‌కు వెళ్లి వస్తున్నట్టు చెప్పారు. మూత్రపిండాల మార్పునకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. 
 
తన రెండు కిడ్నీలూ విఫలమయ్యాయని, కనీసం ఒక కిడ్నీ మార్చాల్సి ఉందని వైద్యులు స్పష్టం చేశారని వెల్లడించిన సుష్మా స్వరాజ్ తన ఆరోగ్యంపై ఎలాంటి దిగులు చెందవద్దని కార్యకర్తలకు చెపుతూనే.. తనను శ్రీ కృష్ణ భగవానుడే కాపాడతాడన్న నమ్మకముందని అన్నారు.