కుప్పకూలిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్
వాయుసేనకు చెందిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానం ఒకటి గురువారం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ జిల్లాలో జరిగింది. భింద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మనకాబాద్ వద్ద ఖాళీ ప్రదేశంలో విమానం కుప్పకూలినట్టు భారత వాయుసేన వెల్లడించింది.
కాగా, ఈ మిరాజ్ ఫైటర్ జెట్‌ను శిక్షణ కోసం వినియోగిస్తున్నారు. ఇందులోభాగంగా, గురువారం ఉదయం సెంట్రల్ సెక్టార్ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలను వాయుసేన దర్యాప్తు చేపట్టింది.