గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (12:53 IST)

ఐదేళ్ల చిన్నారిని చిదిమేసిన కామపిశాచి.. నొప్పి భరించలేక?

ఐదేళ్ల చిన్నారిపై కామపిశాచి విరుచుకుపడ్డాడు. చిన్నారి అనే కనికరం లేకుండా చిదిమేశాడు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ల చిన్నారిపై పాఠశాలలో పనిచేసే ప్యూన్ అత్యా

ఐదేళ్ల చిన్నారిపై కామపిశాచి విరుచుకుపడ్డాడు. చిన్నారి అనే కనికరం లేకుండా చిదిమేశాడు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ల చిన్నారిపై పాఠశాలలో పనిచేసే ప్యూన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడు. 
 
ఉత్తర ఢిల్లీలోని సదరు పాఠశాలలో 40ఏళ్ల వికాస్‌ ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉపాధ్యాయులకు లంచ్‌ బాక్సులు ఇచ్చి వెళ్తున్న సమయంలో ఐదేళ్ల చిన్నారి అతడి కంటపడింది. ఆ చిన్నారిని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కానీ ఐదేళ్ల చిన్నారి నొప్పిని భరించలేక తల్లికి చెప్పేయడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
చిన్నారికి వైద్య పరీక్షలు చేయించగా లైంగిక దాడి జరిగినట్లు తేలింది. ప్రస్తుతం చిన్నారికి చికిత్సను అందిస్తున్నారు. వికాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
 
ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని రేయాన్ అంతర్జాతీయ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ప్రధుమన్ (7) దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే చిన్నారిపై ప్యూన్ రేప్ జరగడంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే రేయాన్‌లో బాలుడి మృతి, చిన్నారిపై అత్యాచారానికి నిరసనగా ఆయా పాఠశాలల ముందు స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. 
 
పాఠశాల యాజమాన్యం నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో తమ పిల్లలకు రక్షణ లేదంటూ ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు.