శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 మే 2017 (15:28 IST)

ఇంద్రాణి ముఖర్జీయాతో కార్తీ చిదంబరం లింకు.... ఎలాంటి సంబంధమంటే?

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన తర్వాత ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జీయా భార్య ఇంద్రాణి ముఖర్జీయాతో చిదంబరం తనయుడు కార్తీ చిదంబ

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన తర్వాత ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జీయా భార్య ఇంద్రాణి ముఖర్జీయాతో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు ఆర్థిక సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 
 
చిదంబరంతో ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ మంగళవారం ఉదయం తనిఖీలు జరిపిన విషయం తెల్సిందే. ఓ మీడియా కంపెనీకి విదేశీ పెట్టుబడుల అనుమతుల మంజూరుకు సంబంధించిన వ్యవహారంలో కార్తీ చిదంబరం నిందితుడని ఎఫ్ఐఆర్ దాఖలైంది. 
 
కార్తీకి చెందిన సంస్థ 2008లో ఐ.ఎన్.ఎక్స్ మీడియా కంపెనీకి క్లియరెన్సులు అందడానికి అనువుగా వ్యవహరించిందన్నది ఆరోపణ. ఆ సమయంలో కార్తీ సంస్థ ఈ ఐ.ఎన్.ఎక్స్ మీడియా నుంచి రూ.10 లక్షల ముడుపులు అందుకున్నట్టు సమాచారం. 
 
ఈ కంపెనీ ఇంద్రాణీ ముఖర్జియా భర్త మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాకు చెందినది కావడం గమనార్హం. దీంతో ఇంద్రాణీతో కార్తీ చిదంబరం ఆర్థిక సంబంధాలు నెరిపినట్టు సమాచారం. ఈ డీల్ పూర్తి చేసేందుకు కార్తీ చిదంబరం భారీ మొత్తంలోనే ముడుపులు స్వీకరించినట్టు సమాచారం.