పుట్టపర్తిని ప్రసాద్ స్కీంలో చేర్చండి...
అనంతపురం జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ణ్నప్తులు చేరాయి. ఈ ప్రాంతాన్ని కేంద్రం ప్రత్యేకంగా చేపట్టిన PRASAD పథకంలో చేర్చాలని... పుట్టపర్తిపై పూర్తి నివేదికను అందజేశారు.
ఢిల్లీ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కలిశారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి ని PRASAD SCHEME ద్వారా మరింత విసృత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్ర పర్యాటక శాఖకు దీనిపై పూర్తి స్థాయి నివేదిక తో పాటు వినతి పత్రం సమర్పించారు.
ఇప్పటికే ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. భగవాన్ గా వెలుగొందిన పుట్టపర్తి సత్యసాయి ప్రాభవంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చేందింది. అయితే, ఆయన మరణానంతరం కొంత భక్తుల తాకిడి తగ్గింది.
ఇక్కడి ప్రశాంతి నిలయం కేంద్రంగా పుట్టపర్తి ప్రాంతాన్ని మరింత పర్యాటక కేంద్రంగా, ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా టూరిజం శాఖ తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై సమగ్ర నివేదికను స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కేంద్ర మంత్రికి అందించారు.