గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (08:13 IST)

బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీరు మృత్యువాతపడ్డారు. 
 
బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ సమీపంలో ఉన్న వార్పోరాలో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్‌తోపాటు పలువురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారనే సమాచారంతో గురువారం రాత్రి స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. 
 
అ క్రమంలో టెర్రరిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.