బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జనవరి 2025 (13:34 IST)

బీజేపీని ఓడించాలంటే కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలవాలి : శరద్ పవార్

sharad pawar
ఢిల్లీ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీయేతర పార్టీలు మద్దతుగా నిలవాలని కేంద్ర మాజీ మంత్రి, వృద్ధ రాజకీయ నేత, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల కోసం ఆప్ పార్టీతో కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయడం లేదు. దీనిపై శరద్ పవార్ స్పందించారు. ఢిఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కేజీవాల్ కు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
 
ఇండియా కూటమి జాతీయ స్థాయిలో మాత్రమే కలసికట్టుగా పని చేస్తోందని... రాష్ట్రాల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇప్పటివరకు చర్చ జరగలేదని శరద్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలా? లేక కలసి పోటీ చేయాలా? అనేది చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రానున్న 8-10 రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజీపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.