ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ : ఫిబ్రవరి 5న పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. జనవరి పదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి ఐదో తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జనవరి 10వ తేదీన విడుదల అవుతుంది. నామినేషన్లు సమర్పణకు జనవరి 17వ తేదీన చివరి తేదీ. నామినేషన్ల పరిశీలనకు జనవరి 18వ తేదీన ప్రారంభంకానుంది. జనవరి 20వ తేదీన నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
కాగా, ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.08 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కోసం 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌లను అందుబాటులో ఉంచనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 85 యేళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది.