MS Raju: ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకు వినతిపత్రం... ఆసక్తికర సన్నివేశం..! (video)
శ్రీసత్యసాయి జిల్లాలో ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తన సొంతూరిలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీటీడీ పాలకమండలి సభ్యులు, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని అందజేశారు.
వాస్తవానికి ఎంఎస్‌రాజుది అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కాగా.. ఆయన శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని.. అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కూడా ఆయనకు అవకాశం దక్కింది.
ఈ నేపథ్యంలో తన సొంతూరిలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకు వినతిపత్ర అందజేయడం చర్చనీయాంశంగా మారింది. ఎంఎస్ రాజు సొంత ఊరు అనంతపురం జిల్లా శింగనమల మండలం అలంకరాయునిపేట. అయితే తన సొంత ఊరిలోని సమస్యలపై.. సోమవారం శింగనమల తహసీల్దారు కార్యాలయంలో జరిగిన డిజిజన్ స్థాయి సమస్యల పరిష్కార వేదికకు వెళ్లారు.
ఎంఎస్ రాజు సొంత ఊరు అనంతపురం జిల్లా శింగనమల మండలం అలంకరాయునిపేట. అయితే తన సొంత ఊరిలోని సమస్యలపై.. సోమవారం శింగనమల తహసీల్దారు కార్యాలయంలో జరిగిన డివిజన్ స్థాయి సమస్యల పరిష్కార వేదికకు వెళ్లారు. అక్కడ అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ని కలిసి.. తమ ఊరిలో ఉన్న సమస్యలను వారికి వివరించారు.
మా ఊరి నుంచి సలకంచెరువు స్కూల్‌కు చాలామంది విద్యార్థులు కాలినడకన వెళతారు. దారి మధ్యలో ఉన్న వంకపై కల్వర్టును నిర్మించాలి. గ్రామ సమీపంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి. ఉపాధి హామీ పథకం కింద పార్కు ఏర్పాటు చేయాలి' అని ఎంఎస్ రాజు కోరారు.
ఈ మేరకు కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యల్ని పరిష్కరిస్తామని కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఎంఎస్ రాజు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి