మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (16:43 IST)

బోటుకు అడుగు భాగంలో చిల్లులు.. మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్స్ (video)

కేరళలోని కన్నూర్ తీర ప్రాంతంలో మత్స్యకారులకు చెందిన ఓ పడవ భద్రియ ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి బోటు అడుగు భాగంలో చిల్లు పడటంతో క్రమంగా దానిలోపలికి నీరు చేరడం మొదలైంది. 
 
పడవలోని మత్స్యకారులు దీన్ని గమనించి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సాయం కోరారు. దాంతో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.
 
అర్ధరాత్రి కోస్ట్ గార్డ్స్‌కు చెందిన విక్రమ్ నౌక సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ప్రమాదానికి గురైన పడవలోని ముగ్గురు మత్స్యకారులను రక్షించారు. 
 
అనంతరం వారిని కొచ్చికి తరలించారు. కోస్ట్ గార్డ్స్ సిబ్బంది విక్రమ్ నౌకలో వచ్చిన మత్స్యకారులను రక్షించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.