మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (09:33 IST)

ఇండిగో విమానంలో శాండ్‌విచ్.. ఇనుప స్క్రూ.. వైరల్

ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. విమానంలో తనకు ఇచ్చిన  ఓ శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ కనిపించిందని ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ నెల 1న ఆ ప్యాసెంజర్ బెంగళూరు నుంచి చెన్నై వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
 
ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కంపెనీ సీఈఓకు నేరుగా ఫిర్యాదు చేయాలని కొందరు సలహా ఇచ్చారు. మరికొందరేమో లింక్డ్‌ఇన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందని చెప్పారు.  
 
ఘటన వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. ప్యాసెంజర్‌కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది.