శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 జులై 2017 (10:55 IST)

జూదంలో భార్యను పణంగా పెట్టాడు.. దుశ్శాసనులకు అప్పగించాడు.. ఇద్దరు అత్యాచారం

జూదానికి బానిసైన ఓ దుండగుడు.. మహాభారతంలో ధర్మరాజు భార్యను జూదంలో పెట్టిన చందంగా.. ఆ ఘటనను ఆదర్శంగా తీసుకుని.. తన భార్యను పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ఆపై భార్యను దుశ్శాసనులకు అప్పగించిన ఘటన మధ్యప్రద

జూదానికి బానిసైన ఓ దుండగుడు.. మహాభారతంలో ధర్మరాజు భార్యను జూదంలో పెట్టిన చందంగా.. ఆ ఘటనను ఆదర్శంగా తీసుకుని.. తన భార్యను పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ఆపై భార్యను దుశ్శాసనులకు అప్పగించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌లోని పోలీసులు నిర్వహించే పబ్లిక్ హియరింగ్‌లో బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించింది. 
 
ఆమె చెప్పిన వివరాల ప్రకారం భర్త జూదానికి బానిసయ్యాడు. జూదానికి డబ్బుల్లేక తన భార్యను పందెం కాశాడు. అందులో ఓటమి చెందడంతో తనను పరాయి మగాళ్లకు అప్పగించాడని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో భర్తకు దూరమైనా.. వేధింపులు మాత్రం ఆగట్లేదు. తన భర్తతో పాటు కీచకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసుపై ఓ నిర్ధారణకు వచ్చాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.