మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (09:34 IST)

అమిత్ షాకు రెచ్చగొట్టడం తప్ప ఇంకేమీ తెలియదు: సిద్ధరామయ్య

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధరామయ్యది అణచివేత, అవినీతి ప్రభుత్వమని అమిత్ షా విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. బీజేపీ

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధరామయ్యది అణచివేత, అవినీతి ప్రభుత్వమని అమిత్ షా విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సర్కారు అసత్యాలు పలుకుతూ.. ఇతరులను విమర్శిస్తూ.. పబ్బం గడుపుకుంటోందని విమర్శలు గుప్పించారు.
 
మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తప్ప అమిత్ షాకు మరేమీ తెలియదని.. అదే ఆయన సిద్ధాంతమని ఏకిపారేశారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడతారని తాను భావించట్లేదని.. కానీ అమిత్ షా సిద్ధాంతం మాత్రం అదేనని తెలిపారు.
 
మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడాన్ని అమిత్ షా రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అలాగే బెంగళూరులో మోదీ పర్యటన వల్ల ముప్పేమీ లేదని.. కర్ణాటకపై ఆయన ప్రభావం ఏమాత్రం ఉండబోదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.