శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (14:31 IST)

చంద్రబాబుకు ఉద్ధవ్ థాక్రే ఫోన్- బీజేపీతో కటీఫ్ చేస్కోండి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ఉద్ధవ్ థాక్రే మీడియా సమక్షంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. బాబుకు ఉద్ధవ్ ఫోన్ చేయడం ప్ర

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ఉద్ధవ్ థాక్రే మీడియా సమక్షంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. బాబుకు ఉద్ధవ్ ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబు, థాక్రేల మధ్య ఫోన్ సంభాషణ సుమారు అరగంట పాటు నడిచిందని సమాచారం. 
 
ఈ సందర్భంగా బాబుతో ఉద్ధవ్ థాక్రే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే  బీజేపీతో కటీఫ్ కావాలనుకుంటున్న బాబుకు ఉద్ధవ్ థాక్రే మాటలు మరింత బలాన్నిచ్చాయని సమాచారం. అంతేగాకుడా బీజేపీతో పొత్తు రద్దు చేసుకుని శివసేన, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి 2019లో బీజేపీతో పోరాడుదామని చంద్రబాబుకు థాక్రే వివరించినట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఈ వ్యవహారంపై నిశితంగా పరిశీలించుకుని తన నిర్ణయాన్ని చెప్తానని ఉద్ధవ్ థ్రాకేతో బాబు వెల్లడించినట్లు సమాచారం. 1990 నుంచి బీజేపీ-శివసేన మధ్య ఏదో రకంగా పొత్తు కొనసాగుతూనే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా ఉద్దవ్ థాక్రే తేల్చిచెప్పేశారు.