శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:51 IST)

జమ్మూ-కాశ్మీర్‌లో ఆ వీడియో వైరల్.. ఇంటర్నెట్ సేవలు రద్దు..

జమ్మూ-కాశ్మీర్‌లో జైష్-ఇ-ముహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో సీఆర్పీఎఫ్ వీరులు 40 మంది హతమయ్యారు. ఈ నేపథ్యంలో జైష్-ఇ-ముహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో దాడికి పాల్పడిన వ్యక్తి మాట్లాడాడు. 
 
ఈ వీడియో జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలో వైరల్ అవుతోంది. ఫలితంగా కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. ఇంకా శ్రీనగర్ వంటి ప్రాంతంలో ఇంటర్నెట్ వేగం, 2జీకి తగ్గించారు. భద్రత దృష్ట్యా ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
 
అలాగే ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తప్పదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించినట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.