శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (18:05 IST)

లక్స్‌పాప షాకిచ్చింది.. అమ్మాయిలతో కూడా ఘాటు రొమాన్స్..

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన ''గంది బాత్‌''కి కొనసాగింపుగా వస్తోన్న ''గంది బాత్-2''లో ఆషాశైనీ కీలక పాత్ర పోషించింది. తెలుగులో  ఆషాశైనీ నరసింహనాయుడు, నువ్వునాకు నచ్చావ్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ లక్స్‌పాప.. ప్రస్తుతం టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆషా శైనీ గంది బాత్-2 అనే వెబ్ సిరీస్‌లో నటించింది. 
 
ఒకే ఇంట్లో ఇద్దరు సోదరులు ఆశాషైనీతో ప్రేమలో పడే కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. కానీ ఈ వెబ్‌ సిరీస్‌లో ఇంకో పాయింట్ కూడా వుంది. ఇందులో ఆషాశైనీ అబ్బాయిలతో మాత్రమే కాకుండా అమ్మాయిలతో కూడా లైంగిక సంబంధం పెట్టుకునే సన్నివేశాలున్నాయని తేలింది. ఇద్దరు అమ్మాయిల మధ్య కొన్ని ఘాటు సీన్లు వున్నాయట. ప్రస్తుతం ఇందులోని కొన్ని సన్నివేశాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.