శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (17:22 IST)

ముంబై లేడిస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు.. అడాప్టర్‌‍పై వస్త్రం కప్పేయడంతో?

ముంబై లేడిస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం బయటపడింది. దక్షిణ ముంబైలోని అప్ మార్కెట్‌‌లో పీజీ చదువుతున్న అమ్మాయిల వీడియోలను సేకరించి.. ఓ ప్రబుద్ధుడు ఇతరులకు పంపాడు. అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..  నాలుగు బెడ్ రూములున్న లేడిస్ హాస్టల్‌ గదుల్లో అడాప్టర్‌లో సీక్రెట్ కెమెరాను వుంచాడు. 
 
ఆపై వారి కదలికలను తన మొబైల్ ఫోన్లను చిత్రీకరించాడు. అయితే ఓ హాస్టల్ అమ్మాయి అడాప్టర్‌పై తన వస్త్రాన్ని ఎందుకో కప్పి వుంచింది. ఆ చర్యే ఈ బండారాన్ని బయటపెట్టింది. అడాప్టర్ పై వస్త్రాన్ని కప్పిన గదికి తనికీ పేరిట వచ్చిన యజమాని, వస్త్రం ఎందుకు కప్పావని ప్రశ్నించడంతో అమ్మాయిలకు అనుమానం వచ్చింది. ఆపై వారు పరిశీలించి చూసి, పోలీసులను ఆశ్రయించారు. 
 
హాస్టల్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఏడాదిన్నరగా అమ్మాయిల ఫుటేజ్‌లను యజమాని సేకరించాడని తేల్చారు. అతనిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.