మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (16:36 IST)

మేష రాశి 2019 వారి ఫలితాలు ఇలా వున్నాయి (Video)

మేషరాశి: ఈ రాశివారికి నవంబర్ 4వ తేదీ వరకు అష్టమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా భాగ్యము నందు, ఈ సంవత్సరం అంతా తృతీయము నందు రాహువు, భాగ్యము నందు కేతువు, 2020 ఫిబ్రవరి వరకు భాగ్యము నందు శని, ఆ తదుపరి అంతా రాజ్యము నందు సంచరిస్తారు. 
 
ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలింపగా 'కృషితో నాస్తి దుర్భిక్షమ్' అన్నట్లుగా అధిక కృషి చేసిన గాని సత్ఫలితాలు అందుకోలేరు. ఆదాయానికి తగ్గ ఖర్చులు చోటుచేసుకుంటాయి. శ్రమతో ఆదాయం అందుకుంటారు. కొత్త ఋణాలు దొరకడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తివ్యాపారాల్లో వారికి ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికి సత్ఫలితాలు కానరాగలవు. ప్రయాణాలు, వాహనాల వలన తరుచు ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత అవసరం. 
 
నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగులకు ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్ వంటి శుభసూచికలున్నప్పటికి అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కుంటారు. ఎప్పటినుండో వాయిదా పడుతున్న పనులు ఒక కొలిక్కిరాగలవు. కోర్టు వ్యవహారాల్లో మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికి చివర్లో కొంత పురోగతి చోటు చేసుకుంటాయి. నిత్యావసరవస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కొంత ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. పాత ఆరోగ్య ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. 
 
నిరుద్యోగులు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. తొందరపడి హామీలు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులు దూరమయ్యే సూచనలున్నాయి. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. నూతన దంపతులు శుభవార్తలు వింటారు. గర్భిణీ స్త్రీలు వృశ్చికంలో గురువు ఉన్నంతకాలం అంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య వ్యవహారాల్లో కొంత అవసరం. విదేశీయాన యత్నాలు బాగా ఖర్చుతో కూడి, ధనవ్యయం, కాలవ్యయంతో సమయం వృధా అయ్యే ఆస్కారం ఉంది. 
 
స్థిరాస్తి కొనుగోలు లేక అమ్మకం వ్యవహారాలు ఈ సంవత్సరం అనుకూలించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. రైతులు శ్రమాధిక్యత ఎదుర్కొన్నప్పటికి చివర్లో అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు. పుణ్యకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతంది. బంధుమిత్రుల్లో మంచి గుర్తింపు పొందుతారు. ఇతురుల ఆలోచనులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి.

కంప్యూటర్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. నవంబర్ దాగా గురువు అష్టమంలో సంచారం చేయు సందర్భంలో చోరభయచం, అగ్నిభయం వంటివి వెంబడిస్తాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారికి నూతన అవకాశాలు కానరాగలవు. ముఖ్యుల విషయాల్లో ఆహ్వానాలు మీకెంతో ఆనందాన్నిస్తాయి. బంధువుల రాకపోకలతో సందడి నెలకొంటుంది. విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతంది. కళా, క్రీడా రంగాల్లో వారికి అనుకోని మార్పు, గుర్తింపు పొందుతారు. ముఖ్యుల సమాచారం మీకెంతో ఆనందాన్నిస్తుంది. 
 
ఈ సంవత్సరం అంతా మేషరాశి వారు సంయమనం పాటిస్తూ ముందుకు సాగితే సత్ఫలితాలు పొందుతారు.
 
* ఈ రాశివారు వైద్యనాధుని ఎర్రని పూలతో పూజించిన సంకల్పసిద్ధి, మనోసిద్ధి చేకూరుతుంది.
* అశ్వని నక్షత్రం వారు జీడిమామిడి, భరణి నక్షత్రం వారు దేవదారు, కృత్తిక నక్షత్రం వారు అత్తి చెట్టును నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి.
* అశ్వని నక్షత్రం వారు కృష్టవైఢూర్యం, భరణి నక్షత్రం వారు వజ్రం, కృత్తికా నక్షత్రం వారు పుచ్చుకెంపు ధరించిన శుభదాయకంగా ఉంటుంది.
వీడియోలో మేష రాశి వివరాలు...