శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (13:12 IST)

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏకంగా 50శాతం వేతనాల పెంపు

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసిన నేపథ్యంలో.. ఏపీ సీఎం చ

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసిన నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 50 శాతం మేర వేతనాలను పెంచారు.
 
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న రెండు కేటగిరీ ఉద్యోగుల వేతనాలను ఏకంగా 50 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. 2016లో ప్రభుత్వం వేతనాలను పెంచుతూ జీవో జారీ చేసింది. 
 
అయితే పెంపు వల్ల కొందరికే ప్రయోజనమంటూ జరిగిందని.. అందుకే రెండు కేటగిరీల ఉద్యోగులకు జీతాలను పెంచాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్థిక శాఖ ఆమోదంతో అవుట్ సోర్సింగ్ వేతనాలను పెంచారు.