శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (15:52 IST)

2018 కన్యారాశి వారికి అమోఘం: శనీశ్వరుడు మంచే చేస్తాడట

2018 కన్యారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశివారు కొత్త సంవత్సరంలో కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉన్నత ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారం, ప

2018 కన్యారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశివారు కొత్త సంవత్సరంలో కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉన్నత ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారం, పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుకూలమైన కాలం. ఏ వ్యాపారం చేసినా ఈ ఏడాది కన్యారాశి వారికి శుభఫలితాలను, అధికలాభాలను ఇస్తుంది.  
 
అలాగే మిథునరాశి జాతకులకు కూడా 2018 శుభ ఫలితాలను ఇస్తుంది. డిసెంబర్ 30 తర్వాత శని దశ మారడంతో మిథునం, కన్యారాశి, మేష రాశుల వారికి శని మంచే చేస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మిథునరాశి వారికి కొత్త సంవత్సరం శుభకరం. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. సంవత్సరమంతా శుభదాయక ఖర్చులుంటాయి. అవివాహితులకు వివాహాలు నిశ్చయమవుతాయి. కోరుకున్న సంబంధాలు కుదురుతాయి. కెరీర్ పరంగా రాణిస్తారు. 
 
ఇక మేష రాశి జాతకులకు కూడా 2018 మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థికపరంగా స్థిరపడతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక సింహరాశి జాతకులకు శనీశ్వరుడు మంచే చేస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు 2018లో ఈ రాశివారి జీవితంలో మార్పులుంటాయి. డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. వీరి పెట్టే పెట్టుబడి లాభాలను సంపాదించి పెడుతుందని వారు చెప్తున్నారు.