Daily Horoscope
✕

నేటి నుంచి జెఈఈ పరీక్షలు

Written By ఎంజీ
Updated: గురువారం, 26 ఆగస్టు 2021 (09:02 IST)
2021  ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ–మెయిన్‌ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) 4వ విడత పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి.

మే లో జరగాల్సిన ఈ పరీక్షలు కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షలు సెప్టెంబర్‌ 2 వరకు జరగనున్నాయి. కాగా, ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు.
 
తొలిరోజు పేపర్‌–2 అయిన బీ.ఆర్క్, బీ.ప్లానింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్‌ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆగస్టు 27, 31, సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి.

జేఈఈ మెయిన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సెషన్‌ పూర్తయిన తరువాత సెప్టెంబర్‌ మూడో వారంలో తుది విడత ఫలితాలను అభ్యర్థుల ర్యాంకులతో సహా ఎన్‌టీఏ ప్రకటించనుంది.  

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments