1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Jharkhand woman kills husband after he denies her permission to wear jeans

జీన్స్ ధరించవద్దని చెప్పని భర్తను హతమార్చిన భార్య.. ఎక్కడ?

Jharkhand
జార్ఖండ్‌లో జరిగిన ఓ సంఘటన షాకింగ్‌కు గురి చేసింది. పెళ్లి తర్వాత జీన్స్‌ ధరించవద్దని భర్త వారించడంతో భార్య తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జోర్భితా అనే గ్రామానికి చెందిన హెంబ్రోమ్‌ అనే మహిళ శనివారం రాత్రి జీన్స్‌ ప్యాంటు ధరించి స్థానికంగా జరిగిన ఓ జాతరకు హాజరై వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె డ్రస్‌ను చూసి భర్త మందలించారు. దీంతో దంపతులు ఇద్దరి మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది.
 
పెళ్లి తర్వాత జీన్స్‌ ఎందుకు ధరించావని భర్త అడగడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశానికి గురైన పుష్ప.. భర్తపై కత్తితో దాడి చేసింది.
 
దీంతో తీవ్రంగా గాయపడిన భర్తను అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 
 
జీన్స్‌ ధరించే విషయంపై తన కూతురు, కోడలి మధ్య గొడవ జరిగిందని.. ఈ క్రమంలోనే కోడలు, తన కొడుకును హతమార్చినట్లు మృతుడి తండ్రి పోలీసులకు తెలిపారు. 
తర్వాతి కథనం
మధ్యప్రదేశ్‌లో ఘోరం - నదిలో బోల్తాపడిన బస్సు