శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (09:03 IST)

జార్ఖండ్‌‍లో పెను విషాదం - ఒకే కుటుంబంలో 8 మంది జలసమాధి

boat tragedy
జార్ఖండ్ రాష్ట్రంలో పెను విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది జలసమాధి అయ్యారు. పడవ బోల్తా పడటంతో వీరంతా మృత్యువాతపడ్డారు. 
 
రాష్ట్రంలోని కోడెర్మా జిల్లాలోని రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం ఆదివారం కావడంతో నిన్న పంచఖేరో డ్యామ్‌కు వెళ్లింది. అక్కడ అందరూ కలిసి ఒకే బోటులో డ్యామ్‌లోకి షికారుకు వెళ్లారు. 
 
అయితే, వీరు ప్రయాణిస్తున్న పడవ డ్యామ్ మధ్యకు వెళ్లేసరికి బోటులోకి ఒక్కసారిగా నీరు రావడంత అది ఉన్నట్టుండి బోల్తాపడింది. ఈ ప్రమాదం పడవ డ్రైవర్ ప్రదీప్ కుమార్ తప్పించుకుని బయటకు రాగా, అందులో ప్రయాణించిన సీతారాం యాదవ్ కుటుంబ సభ్యులంతా మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. 
 
వీరిలో ఏడుగురు మృతులు 17 యేళ్లలోపు వారే కావడం గమనార్హం. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృంద డ్యామ్‌లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.