శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (15:17 IST)

చిక్కుల్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్.. ఈడీ షాక్

hemanth soren
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ చిక్కుల్లో చిక్కుకున్నారు. మైనింగ్ స్కామ్‌లో ఆయన చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఒక మైన్‌ను తన సొంతానికి కేటాయించిన కారణంగా సీఎంగా ఎందుకు అనర్హత వేటు వేయొద్దో చెప్పాలంటూ ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులిచ్చిన కొన్ని రోజులకే ఈడీ కూడా షాకిచ్చింది.
 
మైనింగ్ స్కామ్, ఉపాధి నిధుల దారి మళ్లింపునకు సంబంధించి నిన్న ఆ రాష్ట్రంలోని 12 ప్రదేశాలతో పాటు బెంగాల్, బీహార్‌లో దాడులు చేసింది. జార్ఖండ్ ఐఏఎస్ అధికారిణి, ఆ రాష్ట్ర గనులు, భౌగోళికశాఖ కార్యదర్శి పూజా సింఘాల్ అత్యంత సన్నిహితుల నుంచి రూ.19.31 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో పూజా సింగాల్ చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సుమన్ కుమార్ దగ్గర్నుంచే రూ.17 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
అలాగే మరో ప్రాంతం నుంచి రూ.1.8 కోట్లు సీజ్ చేశారు. లెక్కల్లోలేని డబ్బుతో పాటు పలు డాక్యుమెంట్లనూ ఐఏఎస్ అధికారి ఇంటి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.