మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 14 మే 2018 (10:41 IST)

రమ్య ఎందుకు ఓటేయలేదు.. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు..

కర్ణాటక ఎన్నికలే పోలింగ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకురాలు, నటి రమ్య మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును

కర్ణాటక ఎన్నికలే పోలింగ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకురాలు, నటి రమ్య మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఓటు వేయలేని రమ్య రాజకీయాల గురించి మాట్లాడే నైతిక విలువలను కోల్పోయారని విమర్శించారు.
 
ఓటు వేయని రమ్య నెంబర్‌ వన్‌ సిటిజన్‌ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేశారు. మండ్యలోని కేఆర్ రోడ్డులోని పీఎల్డీ బ్యాంక్ పోలింగ్ కేంద్రంలో రమ్యకు ఓటున్నా.. ఆ హక్కును ఆమె వినియోగించుకోకపోవడంతో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 
 
అలాగే ప్రధాని మోదీపై అనేక విమర్శలు గుప్పిస్తున్న రమ్య.. రాజకీయాల్లో వున్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విమర్శలపై రమ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.