బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 డిశెంబరు 2018 (13:44 IST)

కేరళ న్యూ రికార్డు: ఒకే రాష్ట్రంలో నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు

దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కేరళ సరికొత్త రికార్డును నెలకొల్పింది. దేశంలో ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న రాష్ట్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 
 
ఆదివారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు.. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించారు.  దీంతో కేరళలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ల సంఖ్య నాలుగుకు చేరింది.
 
దేశంలో నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లు కలిగిన ఏకైక రాష్ట్రం కేరళ కావడం విశేషం. ఈ ఎయిర్ పోర్ట్‌ను రెండు వేల ఎకరాల్లో రూ.1800 కోట్ల వ్యయంతో నిర్మించారు. కేరళలో ఇప్పటికే తిరువనంతపురం, కొచ్చిన్, కోళికోడ్ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లు ఉన్నాయి. 
 
కన్నూర్ ఎయిర్ పోర్ట్ ఒకేసారి 2 వేల మంది ప్రయాణికులకు సేవలందించనుంది. ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, కాంగ్రెస్ బాయ్ కాట్ చేశాయి.