ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (11:22 IST)

మహిళా ఉద్యోగులపై వరాల జల్లు.. ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవులు

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మహిళా ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగినులకు ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకు రూ. 37,188 కోట్లు విడుదల చేస్తామని అయన పేర్కొన్నారు. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్ సౌకర్యం కోసం బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లోని అంగన్వాడీలను క్రీచ్‌లుగా మార్చుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ రెండు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లో క్రీచ్‌లను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 
 
''రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న మెటర్నిటీ సెలవులతో పాటు ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ సెలవును కూడా ఇస్తాం. పరిపాలనా యంత్రాంగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మహిళల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం...'' అని యడ్యూరప్ప పేర్కొన్నారు.