బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (17:02 IST)

పునీత్ ప్రాణాలు నిలబెట్టేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు : సీఎం బొమ్మై

ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, పునీత్‌ను కాపాడుకునేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేశారని చెప్పారు. కానీ అందరినీ విషాదంలో ముంచెత్తుతూ పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ విచారం వ్యక్తం చేశారు. 
 
'అతడొక యూత్ ఐకాన్ అని కొనియాడారు. చిత్ర, కళారంగానికి ఇదొక బాధాకరమైన ఘటన అని, తాము ఒక మంచి నాయకుడ్ని కోల్పోయామం' అని బొమ్మై వివరించారు. 
 
కాగా, దివంగత పునీత్ రాజ్ కుమార్‌కు పూర్తి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఉంటాయని వెల్లడించారు. విక్రమ్ ఆసుపత్రి నుంచి పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు.