శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (15:15 IST)

రండి.. ఏకమవుదాం.. మోడీకి దక్షిణాది దెబ్బ రుచిచూపిద్ధాం...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను కబళించేందుకు ఆపరేషన్ ద్రవిడను ప్రారంభించినట్టు టాలీవుడ్ సినీ నటుడు శివాజీ ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను కబళించేందుకు ఆపరేషన్ ద్రవిడను ప్రారంభించినట్టు టాలీవుడ్ సినీ నటుడు శివాజీ ప్రకటించారు. శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దక్షిణాదిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య దక్షిణాది ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. 
 
"రండి! దక్షిణాది దెబ్బ మోడీకి రుచి చూపిద్దా"మని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, పుదుచ్చెరి, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ట్విట్టర్ ద్వారా బహిరంగంగా పిలుపునిచ్చారు. 15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడాన్ని సిద్దరామయ్య తీవ్రంగా తప్పుబట్టారు. 
 
2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల పంపిణీ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ లబ్ది పొందుతాయి. దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన సిద్దరామయ్య, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ఈ నిర్ణయాన్ని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తన ట్వీట్ లో ఆరు రాష్ట్రాల సీఎంల ట్విట్టర్ హ్యాండిల్స్‌‌ను ఆయన ట్యాగ్ చేయడం విశేషం. అలాగే డీఎంకే నేత స్టాలిన్, కాంగ్రెస్ నేత శశి థరూర్‌‌లను కూడా ఆయన ట్యాగ్ చేశారు 
 
నిజానికి నిధుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకునేది. 1971 తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పెరిగిపోయింది. అలాగే, బెంగాల్‌లో బంగ్లాదేశ్, రోహింగ్యాలు అక్రమంగా చొరబడ్డారని గతంలో పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. దీంతో సిద్దరామయ్య దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునివ్వడం గమనార్హం.