ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (15:59 IST)

మూడుముళ్లు వేశాడు... భార్య గర్భవతని తెలిసి షాకయ్యాడు... ఏం జరిగింది?

కర్నాటకలో పెళ్లయిన వరుడు షాక్ తిన్న ఘటన ఒకటి వెలుగుచూసింది. మూడుముళ్లు వేసి పెళ్లాడిన భార్య గర్భవతి అని తెలిసి షాకయ్యాడు. వివరాల్లోకి వెళితే... కర్నాటక లోని బిండేనహళ్లికి చెందిన యువతికి దొడ్డగరుడనహళ్ల

కర్నాటకలో పెళ్లయిన వరుడు షాక్ తిన్న ఘటన ఒకటి వెలుగుచూసింది. మూడుముళ్లు వేసి పెళ్లాడిన భార్య గర్భవతి అని తెలిసి షాకయ్యాడు. వివరాల్లోకి వెళితే... కర్నాటక లోని బిండేనహళ్లికి చెందిన యువతికి దొడ్డగరుడనహళ్లికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడితో పరిచయమైంది. 
 
అతడు ఈమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరై ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. ఐతే ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల వద్ద దాచింది. తను గర్భవతిని అని తెలియగానే అతడిని పెళ్లాడాలని ఒత్తిడి చేసింది. కానీ అతడు కాస్తా ఎస్కేప్ అయ్యాడు. ఈలోపు పెద్దలు ఆమెకు వేరే సంబంధం చూశారు. 
 
ఈ నెల 8న పెళ్లి కూడా చేశారు. ఐతే మూడుముళ్లు వేసి ఇంటికి తీసుకళ్లిన భార్యలో కనిపించిన శారీరక మార్పులు చూసి అతడు షాక్ తిన్నాడు. వైద్యుని వద్ద పరీక్ష చేయించగా ఆమె 8 నెలల గర్భవతి అని తేలింది. దీనితో అతడు యువతి తల్లిదండ్రులకు చెప్పాడు. వారు తమ కుమార్తెను మోసం చేసిన యువకుడిపై కేసు పెట్టారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.