బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (12:52 IST)

కర్నాటక రేపటి నుంచి బ్యాంకులకు ఐదు రోజులు సెలవులు

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా... బ్యాంకులు బుధవారం నుంచి శుక్రవారం వరకు పనిచేయవని  కర్నాటక అధికారులు ప్రకటించారు.

బ్యాంకులకు మూడు రోజుల సెలవులతోపాటు శని, ఆదివారాలు కూడా సెలవు ఉంటుందని తెలిపారు. మొత్తం ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయని చెప్పారు.

ఖాతాదారులు బ్యాంకు లావాదేవీలను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో... ఎపిఎంసి మార్కెట్‌లో కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.