మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (11:55 IST)

కర్ణాటక మంత్రి చూసిన అశ్లీల ఫొటోలు ఎవరివో తెలుసా.. ఆ దేశాధ్యక్షుడి భార్యవట..!

ఇటీవల కర్నాటకకు చెందిన విద్యాశాఖామంత్రి తన్వీర్ సేఠ్ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో అశ్లీల ఫోటోలు చూస్తూ కెమెరా కంటికి చిక్కిన విషయం తెల్సిందే. ఇది కర్నాటక రాజకీయాలను

ఇటీవల కర్నాటకకు చెందిన విద్యాశాఖామంత్రి తన్వీర్ సేఠ్ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో అశ్లీల ఫోటోలు చూస్తూ కెమెరా కంటికి చిక్కిన విషయం తెల్సిందే. ఇది కర్నాటక రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. అయితే, ఆ మంత్రివర్యులు చూసిన ఫొటోలు ఎవరివన్న సంగతి ఇప్పడు తెలిసింది. ఆ ఫొటోలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియావట.
 
తన్వీర్ సేఠ్ చూసిన ఫొటోలు మెలానియావని ప్రముఖ జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మెలానియా మోడల్‌గా ఉన్నప్పటి ఫొటోలను చూస్తూ, తన్వీర్ ఎంజాయ్ చేశారు. ఇది కాస్తా మీడియా కెమెరా కంట పడటంతో, ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన రాజీనామా చేయాలంటూ బీజేపీ, జేడీఎస్ పార్టీలు డిమాండ్ చేశాయి.