గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (11:26 IST)

భర్తను వేధించిన భార్య.. ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం..

suicide
కర్ణాటకలో అక్రమ సంబంధం దారుణానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని తుమకూరులోని పీహెచ్ కాలనీలో సమీవుల్ల (45) అతనికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. అయితే తన భార్య, ఆమె మిత్రుడితో ప్రేమలో పడింది. ఈ విషయం సమీవుల్లకు తెలియడంతో అతని భార్య తమ ప్రియుడితో జంప్ అయ్యింది. 
 
అంతటితో ఆగకుండా తమ పిల్లలకు వీడియో కాల్ చేస్తూ.. మాజీ భర్తను వెకిలిగా మాటలు అనేది. దీంతో ఆమాటలు తట్టుకోలేని సమీవుల్ల తమ ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేశాడు.
 
సమీవుల్ల మరణించగా, ముగ్గురు పిల్లలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక తన భార్య కారణంగానే సమీవుల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో పోలీసులు సమీవుల్ల భార్యపై కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.