ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chakri
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (13:03 IST)

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఇవ్వనున్న కానుక......

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఒక కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం రూ.3.5 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును జర్మనీ నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక పర్యటనకు ర

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఒక కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం రూ.3.5 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును జర్మనీ నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక పర్యటనకు రాష్ట్రపతి వచ్చినప్పుడు దీన్ని వినియోగిస్తారు. రాష్ట్ర పరిపాలనా విభాగం మరియు ఇంటెలిజెన్స్ విభాగం కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి.
 
ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ప్రమాదాలను ముందుగానే గుర్తించి, సమాచారాన్ని తెలియజేసే సాంకేతిక పరిజ్ఞానం ఉండటం ఈ కారు ప్రత్యేకత. ఇందులో రక్షణ కోసం 7కుపైగా ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కోణంలో పనిచేసే రహస్య కెమెరాలు ఉంటాయి. సులభంగా డ్రైవింగ్ చేసే విధంగా ఇంటెలిజెన్స్ డ్రైవింగ్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇందులో అదనపు ప్రత్యేకతలు.
 
త్వరలోనే ఈ కారును జర్మనీ నుండి బెంగుళూరుకు తీసుకురానున్నారు. ఈ కారు పూర్తిగా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉంటుంది. దీన్ని రాష్ట్రపతికి మాత్రమే కాకుండా ఉప రాష్ట్రపతి, ప్రధాని మరియు ఇతర దేశాల అధ్యక్షుల పర్యటనల కోసం కూడా వినియోగించే అవకాశం ఉంది.