కాశ్మీర్‌లో వేర్పాటువాదులపై ప్రజల తిరుగుబాటు.. గిలానీకి వ్యతిరేకంగా బంద్
కాశ్మీర్‌లో వేర్పాటువాదులపై ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులోభాగంగా, వేర్పాటువాద హురియత్ నేత గిలానీకి వ్యతిరేకంగా గురువారం ఏకంగా శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పరిస్థితి కాస్త ఉ
కాశ్మీర్‌లో వేర్పాటువాదులపై ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులోభాగంగా, వేర్పాటువాద హురియత్ నేత గిలానీకి వ్యతిరేకంగా గురువారం ఏకంగా శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రికంగా మారింది.
ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయంతెల్సిందే. దీంతో వేర్పాటువాదుల పిలుపు మేరకు దాదాపు 3 నెలలుగా బంద్ కొనసాగుతోంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దుకాణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడి జీనజీవనం స్తంభించిపోయింది.
ఇది అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అన్నివర్గాల ప్రజలు వేర్పాటువాదులపై మండిపడుతున్నారు. వేర్పాటువాదులు చీటికి మాటికీ బంద్‌కు పిలుపునివ్వడంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, పనులు లేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వారు వాపోతున్నారు.